పవన్ కల్యాణ్ కు ప్రాణహాని.. పోలీసులకు జనసేనుల ఫిర్యాదు
గుర్తుతెలియని వ్యక్తులు.. గుర్తుతెలియని వాహనాల్లో రెండ్రోజులుగా రెక్కీ చేస్తున్నారని, నంబర్ ప్లేట్ లేని కారులో పవన్ ను..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందంటూ.. ఆ పార్టీ నేతలు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద తిరుగుతున్నారని, పవన్ కోసం రెక్కీ చేస్తున్నారని.. పవన్ వాహనాలను ఫాలో అవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు.. గుర్తుతెలియని వాహనాల్లో రెండ్రోజులుగా రెక్కీ చేస్తున్నారని, నంబర్ ప్లేట్ లేని కారులో పవన్ ను ఫాలో అవుతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఓ పార్టీ నుంచి తమ పార్టీ అధినేతకు ప్రాణహాని ఉందని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొన్న కారులోనూ, నిన్న బైకులపైనా పవన్ వాహనాన్ని అనుసరించారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి పవన్ ఇంటి దగ్గర గొడవ చేశారు. పవన్ ఇంటి ఎదురుగా వారు కారు నిలపగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోబోయారు. దాంతో వారు బూతులతో పవన్ కల్యాణ్ ను దూషించారు. సెక్యూరిటీ సిబ్బందిని వారు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ సిబ్బంది సంయమనం పాటించి ఆ ఘటనను వీడియో తీశారు" అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.