యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు;

Update: 2024-11-27 06:45 GMT
road accident, car, five people died, uttar pradesh
  • whatsapp icon

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరణించిన వారు మొత్తం వైద్యులే. మంగళవారం అర్ధరాత్రి కన్నౌజ్ లో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అటువైపు నుంచి వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

కారును ట్రక్కు ఢీకొట్టడంతో...
మృతులు సైఫాయి మెడికల్ కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసిస్తున్న వారిగా గుర్తించారు. ఐదుగురు పీజీ విద్యార్థులుగా పోలీసులు చెప్పారు. మరో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News