చితి నుండి తలను తీసుకుని వెళ్లారు.. కారణం తెలిస్తే షాకవుతారు..!
చితి నుండి తలను తీసుకుని వెళ్లారు.. కారణం తెలిస్తే షాకవుతారు..!
స్మశానంలో మండుతున్న శవం.. ఇంతలో ఒకతను వచ్చి తల తీసుకుని వెళ్ళాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్‌లో ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి స్మశానం దగ్గరకు వచ్చాడు. కాలిపోతున్న చితిలోంచి మృతదేహం తలను బయటకు తీశాడు. దీంతో అందరూ షాకయ్యారు.
చేతబడి చేయడానికే ఈ పనికి తెగబడ్డారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ఉపేంద్రని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. షాజహాన్‌పూర్‌లో చేతబడి కోసం కాలుతున్న చితిలోంచి శవం తలను వేరు చేసి తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు ఇంకా పరారీలో ఉన్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రోలి గ్రామంలో చోటుచేసుకుంది. అదనపు ఎస్పీ (రూరల్) సంజీవ్ కుమార్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ "నిందితులను ఉపేంద్ర, సురేంద్ర కుమార్.. మనోజ్‌లుగా గుర్తించారు.. వారిపై IPC సెక్షన్ 297 కింద కేసు నమోదు చేశారు. నిందితులు మత్తులో ఉన్నారు. ఉపేంద్ర, మనోజ్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం సురేంద్ర పరారీలో ఉన్నాడు." అని చెప్పుకొచ్చారు.
ప్రాథమిక దర్యాప్తులో, నిందితుడి తండ్రి చేతబడి చేసేవాడని పోలీసులు కనుగొన్నారు. అందుకు తల అవసరమని తెలియడంతో ఈ పనికి తెగించారని ఆరోపించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 60 ఏళ్ల కుబేర్ గంగ్వార్ మరణించిన సంఘటన సోమవారం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. చితి ఇంకా కాలుతూ ఉండగానే ప్రధాన నిందితుడు, అతని సహచరులతో కలిసి చితిలో నుండి మృతుడి తలను బయటకు తీసినట్లు ఎస్పీ రూరల్, సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
అర్థరాత్రి, ముగ్గురు వ్యక్తులు కాలుతున్న చితి నుండి తలను తీసుకుని వెళ్లినట్లు స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా నిందితుడి నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గంగ్వార్ కుమారుడు విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధనవంతులుగా చేయడానికి క్షుద్ర పూజ చేయాలని అనుకున్నారని.. ఆ సమయంలో చితి నుండి పుర్రె తీసుకురావాలని తాంత్రికుడు చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు.