NIA : ఉగ్రదాడి కుట్ర విఫలం.. ఛేదించిన ఎన్ఐఏ

ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ భగ్నం చేసింది. కీలక నిందితులను అరెస్టు చేసింది;

Update: 2023-12-18 13:31 GMT
national investigation agency, terrorists, conspiracy, miraj

national investigation agency

  • whatsapp icon

ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ భగ్నం చేసింది. కీలక నిందితులను అరెస్టు చేసింది. వారి నుంచి పెద్దయెత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఈరోజు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దాడులు చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో పందొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.

కీలక నిందితుడు...
దేశ వ్యాప్తంగా పెద్దయెత్తున పేలుళ్లు జరపాలని వీరు కుట్ర చేశారని విచారణలో తేలింది. దాడుల్లో నిందితుల నుంచి అనేక కీలక పత్రాలు, సీడీలతో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కీలక నిందితుడు మీనాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీనాజ్ తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరందరికీ ఖలీఫా ఐసిస్ తో సంబంధాలున్నాయని గుర్తించారు.


Tags:    

Similar News