వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ ను తమిళనాడులోని మధురై అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి కేసులో శ్రీకాంత్ ఏ1 నిందితుడిగా శ్రీకాంత్ ఉన్నాడు.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్ ఆపై అనుమానస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ పేరు ఏ1 గా చేర్చడంతో ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది.
హత్య కేసులో...
దళిత యువకుడిది హత్యే అని విచారణ ద్వారా నిర్ధారించారు పోలీసులు. మాజీ మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్ అనే యువకుడు పోలీసుల విచారణలో వెల్లడించడంతో మంత్రి కుమారుడు శ్రీకాంత్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ కేసు మొత్తం వ్యవహారంలో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకొచ్చారు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తీసుకు వస్తున్నారు.