రూబీ హోటల్ అగ్ని ప్రమాదం... నలుగురి అరెస్ట్
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులని భావిస్తున్న యజమాని రంజిత్ సింగ్ బగ్గా, కుమారుడు సుమిత్ బగ్గాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ లో ఉన్న ఒక ఫాంహౌస్ లో ఉండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్ లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.
దర్యాప్తు వేగవంతం..
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది వరకూ గాయాలపాలయ్యారు. హోటల్ సెల్లార్ లో ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ సయితం మూడు పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.