వాయిదా కట్టలేదని.. గర్భిణీపై ట్రాక్టర్ ఎక్కించి చంపిన దుర్మార్గులు

ఆ సమయంలో మిథిలేష్ తో పాటు ఇంట్లో తమ కుమార్తె మోనిక మాత్రమే ఉన్నారు. తమ ట్రాక్టర్ తీసుకువెళ్లవద్దని..

Update: 2022-09-17 11:45 GMT

రుణాలు చెల్లించాలంటూ.. లోన్ యాప్ లు చేసే వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది కాకుండా తాజాగా లోన్ రికవరీ ఏజెంట్లు చేసిన దాష్టీకపు పనికి అందరూ షాకయ్యారు. గర్భిణీ స్త్రీ అన్న కనికరం కూడా లేకుండా.. ఆమెపైకి ట్రాక్టర్ ఎక్కించి మరీ ప్రాణాలు తీశారు ఆ రికవరీ ఏజెంట్లు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

హజారీబాగ్ జిల్లాలోని ఇచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియానాథ్ గ్రామంలో మిథిలేష్ మెహతా అనే వికలాంగ రైతు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతను మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇటీవల సకాలంలో కొన్నివాయిదాలను సరైన సమయానికి చెల్లించలేకపోయాడు. సెప్టెంబర్ 15వ తేదీన రికవరీ ఏజెంట్లు మిథిలేష్ ఇంటికి వెళ్లి.. వాయిదాలు చెల్లించని కారణంగా ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు.
ఆ సమయంలో మిథిలేష్ తో పాటు ఇంట్లో తమ కుమార్తె మోనిక మాత్రమే ఉన్నారు. తమ ట్రాక్టర్ తీసుకువెళ్లవద్దని.. త్వరలోనే వాయిదాల నగదు చెల్లిస్తామని వేడుకున్నారు. ఈ క్రమంలో రికవరీ ఏజెంట్లు - మిథిలేష్ లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఏజెంట్లు మోనికను పక్కకు నెట్టి ట్రాక్టర్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారికి అడ్డుపడిన మోనికపై ట్రాక్టర్ ఎక్కించడంతో ఆమె తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మోనిక 3 నెలల గర్భిణి. ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసుకున్నారు. ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్తున్నట్లు ఫైనాన్స్ కంపెనీ అధికారులు సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News