బోధన్ లో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్ అమలు
ఈ విగ్రహ ఏర్పాటుపై మైనార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే బైఠాయించిన
బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ లో శివాజీ విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్ లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుపై మైనార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే బైఠాయించిన మైనారిటీ నాయకులు.. వెంటనే శివాజీ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇరు వర్గాల మధ్య శాంతి చేసేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. అంతలో ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమయింది. చేసేదిలేక పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ .. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో.. బోధన్ లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.