కూల్ డ్రింక్స్ తో వెళుతున్న ట్రక్.. ఇంతలో భారీ యాక్సిడెంట్
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ట్రక్కు- జీపును ఢీకొట్టిన ఘటనలో
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ట్రక్కు- జీపును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మండవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే మహ్వా-మందావర్ హైవేపై బిర్సానా క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కులో కూల్ డ్రింక్స్ లోడ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహ్వా, మందావర్ పోలీస్ స్టేషన్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు మాండావర్, మహ్వాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్రిటికల్ గా ఉన్న ముగ్గురిని జైపూర్‌కు తరలించారు.
జైపూర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు, "దౌసా జిల్లాలోని మందావర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే విచారకరమైన సమాచారం అందింది. దేవుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగిన మరో సంఘటనలో.. బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో మహిళ, ఆమె కుమారుడు మరణించినట్లు పోలీసులు సోమవారం నాడు తెలిపారు. జిల్లాలోని తిలక్‌పురి గ్రామ సమీపంల ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌హెచ్‌ఓ రామావతార్ మీనా తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.