ఢిల్లీలో మసాజ్.. తెలుగు కుర్రాళ్ళు ఏమయ్యారంటే?
ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఒక హోటల్లో ఉంటున్న ఐదుగురు యువకులను
మసాజ్ సెంటర్ పేరుతో తెలుగు కుర్రాళ్లను మోసం చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఒక హోటల్లో ఉంటున్న ఐదుగురు యువకులను మసాజ్ సెంటర్ పేరు ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. దౌర్జన్యం చేసి వారి దగ్గర నుండి రూ.27,000 నగదును దోచుకున్నారు. మోసపోయిన యువకులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సోహైల్, గులాం రబ్బానీ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడకు చెందిన రవ్వలపాటి మోజెస్ అతని స్నేహితులు నవీన్, దినేష్, సురేందర్, సందీప్ లు పహార్ గంజ్ లోని హోటల్ అమాన్ లో ఉన్నారు. తెల్లవారు జామున 4.30 సిగరెట్ కాల్చడానికి బయటకు రాగా ఒక వ్యక్తి వీరికి మసాజ్ సెంటర్ గురించి చెప్పాడు. ఐదుగురు స్నేహితులను ఆ వ్యక్తి హోటల్ తాన్యకు తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళను కూర్చోమని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి తలుపులు గడి పెట్టారు. ఐదుగురిని చితక్కొట్టి వారి నుంచి డబ్బులు లాగేసుకున్నారు. ఫోన్ పే ద్వారా రూ.27,000 తమ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఢిల్లీ విడిచి వెళ్లాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. అయితే వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఈ సంఘటనలో హోటల్ యజమాని, మేనేజర్ పాత్ర గురించి ఆరా తీస్తున్నారు.