ఫ్యాక్ట్ చెక్: ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును పొడిగించలేదు

జూలై 31, 2024 గడువు కంటే ముందే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. AY 2024-25కి సంబంధించిన 6.5 కోట్ల ఐటీఆర్‌లు జూలై 30 నాటికి ఫైల్ అయ్యాయని డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2024-08-01 10:33 GMT

IT Returns

జూలై 31, 2024 గడువు కంటే ముందే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు సూచించింది. AY 2024-25కి సంబంధించిన 6.5 కోట్ల ఐటీఆర్‌లు జూలై 30 నాటికి ఫైల్ అయ్యాయని డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై 30న రోజు నాటికి ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య 45 లక్షలు దాటింది. గడువు తేదీ ఆఖరి రోజైన జూలై 31న భారీగా పన్ను చెల్లిస్తారని అంచనా వేస్తున్నారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది గడువును ప్రభుత్వం పొడిగించలేదు. అయితే, వెబ్‌సైట్‌లో లాగిన్‌లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సోషల్ మీడియాలో గడువును పొడిగించడంపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. 

సోషల్ మీడియా వినియోగదారులు, ముఖ్యంగా X, వాట్సాప్ వినియోగదారులు.. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును ఆగస్టు 31, 2024 వరకు పొడిగించినట్లు చూపిస్తూ ఒక మెసేజీని షేర్ చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు "ITR తేదీని పొడిగించండి" అనే శీర్షికతో డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ రంజిత్ చందన్ సంతకం చేసిన అడ్వైజరీని పంచుకున్నారు.


“ITR भरने की अंतिम तिथि बढ़ाई गई... अब नई अंतिम तिथि 31 अगस्त की गई” అంటూ హిందీలో కూడా పోస్టులు పెడుతున్నారు. "ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ పొడిగించారు.. ఇప్పుడు కొత్త తేదీ ఆగస్టు 31" అంటూ ఆ పోస్టుల్లో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆదాయపు పన్ను శాఖ ఐటీ రిటర్న్‌ల గడువును పొడిగించలేదు.
మేము వైరల్ అవుతున్న మెసేజీని, అడ్వైజరీని గమనించినప్పుడు, ఇది భారతదేశంలోని ఆదాయపు పన్ను శాఖ ద్వారా కాకుండా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేశారని మేము కనుగొన్నాము. ఈ సూచనను తీసుకొని.. మేము PRGI వెబ్‌సైట్‌ లో సెర్చ్ చేశాం.. మేము వారి వెబ్‌సైట్‌లో వైరల్ అడ్వైజరీని కనుగొన్నాము.
ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది PRP చట్టం 2023 కింద వార్తాపత్రికలు, పత్రికలను నమోదు చేసుకునే పోర్టల్. ఇది ప్రచురణకర్తలు సమర్పించిన వార్షిక ప్రకటనలను ఓ చోటకు తీసుకుని వస్తుంది.. అలాగే విశ్లేషణలను కూడా అందిస్తుంది. ఈ ప్రకటనలు వారు ప్రచురించిన వార్షిక నివేదిక ‘ప్రెస్ ఆఫ్ ఇండియా’ ఆధారంగా రూపొందిస్తారు, ఇది దేశంలోని ప్రింట్ మీడియా ల్యాండ్‌స్కేప్ సమగ్ర స్నాప్‌షాట్‌ను అందిస్తుంది.
ప్రింట్ మీడియా ప్రచురణకర్తల వార్షిక స్టేట్‌మెంట్‌ల దాఖలును ఆహ్వానిస్తూ PRGIలో గతంలో ప్రచురించిన మరొక అడ్వైజరీని కూడా మేము కనుగొన్నాము. అందులో “2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రెస్ సేవా పోర్టల్ ద్వారా 03.05.2024న వార్షిక స్టేట్‌మెంట్‌ల ఇ-ఫైలింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. కాబట్టి, PRGI (గతంలో RNI)తో రిజిస్టర్ చేసిన పీరియాడికల్స్ ఉన్న ప్రచురణకర్తలు ప్రెస్ సేవా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వార్షిక స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయాలి" అని సూచించారు.
PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా.. వైరల్ అవుతునం వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపిందని కూడా మేము కనుగొన్నాము. PIB పోస్ట్ చేసిన X పోస్ట్ లో “సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆఫీస్ ఆఫ్ ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఐటీఐఆర్ గడువు తేదీ పొడిగింపుగా తప్పుగా భావిస్తున్నారు. ITR ఫైల్ చేయడానికి గడువు తేదీ 31 జూలై 2024 ” అని అందులో ఉంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌కమ్ టాక్స్ ఇండియా అధికారిక X ఖాతా లో కూడా పోస్టు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న చిత్రం ITR క ఇ-ఫైలింగ్ తేదీని పొడిగించే సమాచారం కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఆదాయపు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి గడువు తేదీ పొడిగించారు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News