ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను బ్యాన్ చేసిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం;

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బైక్ ను సొంతం చేసుకోవాలని అన్ని వయసుల వారు ప్రయత్నిస్తూ ఉంటారు. నెలవారీ ఈఎంఐ సదుపాయాల కారణంగా ఇప్పుడు ఈ బైక్స్ సేల్స్ కూడా భారీగా పెరిగాయి. కొన్ని షో రూమ్ లలో కేవలం ₹ 25,000 డౌన్ పేమెంట్ మరియు సులభమైన నెలవారీ EMIతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350ని మీ సొంతం చేసుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ క్రూయిజర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹ 1.74 లక్షలకు మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర ₹ 2.18 లక్షల వరకూ ఉంటుంది. ఈ కంపెనీ బుల్లెట్, క్లాసిక్ మోడల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ వీటికి కొందరు కంపెనీ ఇచ్చే సైలెన్సర్లు కాకుండా ఇతర సైలెన్సర్లు వాడుతూ ఉంటారు. ఆ సైలెన్సర్ల కారణంగా ఊహించని శబ్ద కాలుష్యం. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తూ ఉంటారు.
అయితే తెలంగాణలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బండిని బ్యాన్ చేశారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
"తెలంగాణలో బుల్లెట్ బండి బ్యాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయంBullet Bike in Telangana7Gmedia" అంటూ పోస్టు పెట్టారు.
"ప్రభుత్వం సంచలన నిర్ణయం తెలంగాణాలో బుల్లెట్ బండి బ్యాన్" అంటూ ఫేస్ బుక్ లో కూడా ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
https://www.facebook.com/reel/
"బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్దంతో చిన్నారులు.. వృద్ధులకు ముప్పు పొంచి ఉంది. రహదారులపై వెళ్లే సమయంలో బుల్లెట్నుంచి వచ్చే అధిక శబ్దంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు నడిపే ఇతర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం, డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి బులెట్ బండ్లను వాడటం వల్ల నడిపేవాళ్లకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు" అని ఆ వీడియో పైన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను కూడా వీడియో కోసం వాడారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ బైక్స్ ను బ్యాన్ చేయలేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేశాం. మాకు ఎలాంటి మీడియా కథనాలు కూడా కనిపించలేదు. ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను, వెబ్ సైట్ లను జల్లెడ పట్టాం. ఎక్కడా కూడా మాకు సంబంధిత ప్రకటనలు కనిపించలేదు.
మా తదుపరి పరిశోధనలో "డుగ్గు.. డుగ్గు.. బుల్లెట్ బండి రైడర్లకు ఇక బ్యాండే.. పోలీసుల కఠిన హెచ్చరికలు..!" అంటూ ఓ కథనాన్ని మేము సమయం వెబ్సైట్ లో కనుగొన్నాం. అందులో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారుల ఆదేశాల గురించి ప్రస్తావించారు. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజులుగా ప్రత్యేకంగా బుల్లెట్ బైక్‌లపై నిఘా పెట్టారని, ఇందులో భాగంగా అధిక శబ్ధం చేసే సైలెన్సర్‌లు బిగించిన 80 బుల్లెట్ బైకులను గుర్తించి కేసులు నమోదు చేశారని నివేదించారు. ఈ బైక్‌లకు సంబంధించిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి, అసలు షోరూం సైలెన్సర్‌ను తిరిగి అమర్చిన తర్వాత మాత్రమే వాహనాలను యజమానులకు అప్పగిస్తున్నారు. బాధ్యతగా భావించి యజమానులు ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. అధిక శబ్ధం చేసే సైలెన్సర్‌లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విజయ్ మోహన్ హెచ్చరించారు. కేసులు నమోదు చేస్తామని, వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను మేము ఫోన్ లో సంప్రదించి తెలంగాణలో ఏవైనా బైక్స్ ను బ్యాన్ చేశారా అనే విషయమై స్పందించమని కోరాం. అలాంటిది ఏమీ జరగలేదని పోలీసులు వివరించారు.
హైదరాబాద్ నగరం బంజారాహిల్స్ లోని రాయల్ ఎన్ ఫీల్డ్ షో రూమ్ ను కూడా సంప్రదించాం. అలాంటి సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అన్ని ప్రమాణాలు పాటించిన తర్వాతే బైక్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు వివరించారు.
కాబట్టి, తెలంగాణలో బుల్లెట్ బైక్స్ ను బ్యాన్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం
Claimed By : Social Media Users
Fact Check : False