ఫ్యాక్ట్ చెక్: కచోరీ స్టాల్ లో ఎలుకలు తిరుగుతున్నట్టు చూపుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
భారతదేశంలో పురాతన కాలం నుండి వీధుల్లో ఆహారాన్ని అమ్మే సంస్కృతి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల;
By - Satya Priya BNUpdate: 2025-04-12 08:33 GMT
భారతదేశంలో పురాతన కాలం నుండి వీధుల్లో ఆహారాన్ని అమ్మే సంస్కృతి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ రకాల సంస్కృతుల కలయిక వీధి ఆహారంలో భాగమైంది. ఉత్తర భారతదేశంలో వీధుల్లో అమ్మే ఆహారంలో ఎక్కువ గ్రేవీ, చోలే పూరి, చాట్ వంటి ఆహార పదార్థాలు ఉంటాయి, దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోస వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో వడ పావ్, పావ్ భాజీ వంటి స్పైసీ ఫుడ్ కనిపిస్తుంది, తూర్పున ఝల్ మురి, చుర్మురి వంటివి ప్రజలకు ఇష్టమైనవి. దేశవ్యాప్తంగా టీ, కాఫీతో పాటు ఆల్ టైమ్ ఫేవరెట్స్ సమోసా, కచోరీలను విక్రయించే ఎన్నో స్టాల్స్ ను కూడా మనం చూస్తాము. స్ట్రీట్ ఫుడ్ ఎంతో సులభంగా లభిస్తుంది. సరసమైన ధరలకే లభిస్తూ ఉండడంతో ప్రజలను తప్పకుండా ఆకర్షిస్తుంది. కానీ ఈ ఆహారాల చుట్టూ బ్యాక్టీరియా, వైరస్ ముప్పు కూడా పొంచి ఉంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రోడ్డు పక్కన విక్రయించే వీధి ఆహారం మీద దుమ్ము, ఈగలు, ఎలుకల బెడద కూడా ఉంటుంది.
కచోరీలపై ఎలుకలు తిరుగుతున్నట్టు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ చాలా అనారోగ్యకరమైనదని, దానిని నివారించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ పలువురు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అసలు వీడియోలో ఎలుకలు లేవు, ఎలుకలను డిజిటల్‌గా అసలు వీడియోకు జోడించారు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు ఆహార విక్రేత కచోరిని తయారు చేస్తున్న అసలు వీడియోలను మేము కనుగొన్నాము, కానీ ఈ వీడియోలలో ఎలుక కనిపించలేదు.
అక్టోబర్ 2024లో ‘కచోరి యా గొల్గప్ప’ అనే శీర్షికతో ప్రచురించిన యూట్యూబ్ షార్ట్ ఇక్కడ ఉంది.
Dal Kachori అనే క్యాప్షన్ తో సెప్టెంబర్ 20, 2024న ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అదే వీడియోను షేర్ చేశారు
మరో యూట్యూబ్ యూజర్ ‘7 baap wala kachori seller in Firozabad’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను అక్టోబర్ 2023 లో షేర్ చేశారు. ఈ ఒరిజినల్ వీడియోలలో మాకు ఏ ఎలుక కనిపించలేదు.
‘7 బాప్ వాలా కచోరి’ అనే కీవర్డ్‌లతో మేము మరింత శోధించినప్పుడు, అదే వీధి విక్రేత తన రుచికరమైన ఆహారం గురించి రికార్డ్ చేసిన అనేక వీడియోలను మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఏడుగురు తండ్రి పాత్రను పోషిస్తారని, వారు ఎవరు అని అతను వివరించడం చూడవచ్చు.
‘Wonder with hassan’ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇదే వీధి వ్యాపారి గురించి వివరాలను షేర్ చేశారు. అతడు ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఉంటారని తెలిపారు.
మరింత శోధించినప్పుడు, ఆహారంపై ఎలుక పాకుతున్న వీడియోను AI టెక్నాలజీని ఉపయోగించి సృష్టించినట్లు మేము కనుగొన్నాము. AI వాలా ఫుడీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మార్చి 20, 2025న ‘ట్యాగ్ కచోరి లవర్స్, వీడియో జనరేట్ బై AI’ అనే క్యాప్షన్‌తో వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు డిలీట్ చేసారు కాబట్టి మేము దాని స్క్రీన్ షాట్ ను ఇక్కడ షేర్ చేస్తున్నాం.
స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు అమ్మే ఆహారం మీద ఇలాంటి ఎలుకలు, ఇతర జంతువులు పాకుతున్నట్లు చూపించే అనేక వీడియోలు మాకు లభించాయి. ప్రచురించిన అన్ని వీడియోలు AI ద్వారా రూపొందించినట్లుగా వివరణ ఇచ్చారు. ఈ సోషల్ మీడియా వినియోగదారుడి బయోను తనిఖీ చేసినప్పుడు, ‘అన్ని వీడియోలు AI ద్వారా రూపొందించారు’ అనే డిస్క్లైమర్‌ను చూడొచ్చు.
బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్, అలాగే
వారు తయారు చేసిన మరొక స్ట్రీట్ వెండర్ వీడియో స్క్రీన్ షాట్ లను ఇక్కడ
చూడొచ్చు.
ఈ వీడియోను డి-ఇంటెంట్ డేటా వారి X ప్రొఫైల్‌లో ఖండిస్తున్నట్లు వివరణ ఇచ్చింది.
స్ట్రీట్ ఫుడ్ వెండర్ కచోరీలు అమ్ముతుండగా, ఆహారంపై ఎలుకలు పాకుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో AI జనరేటెడ్ వీడియో. అసలు వీడియోలో ఎలుక కనిపించదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కచోరీలు అమ్ముతున్న షాప్ లో ఆహారంపై ఎలుకలు తిరుగుతూ కనపడ్డాయి
Claimed By : Social media users
Fact Check : False