ఫ్యాక్ట్ చెక్: టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ తెలిపింది

గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని;

Update: 2025-04-11 15:25 GMT
ఫ్యాక్ట్ చెక్: టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ తెలిపింది
  • whatsapp icon

టీటీడీ గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. గోవులకు టీటీడీ గోశాలలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని, వరుస గోమరణాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


ఎస్వీ గోశాల గోవధ శాలగా మారిందని, ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చేసిన పాపమే అంటూభూమన కరుణాకర్ రెడ్డి‌. విమర్శలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయని, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని అన్నారు. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారన్నారు. చనిపోయిన ఆవుల లెక్కలు, ఆవుల మృతికి సంబంధించిన వివరాలు బయటకు రాకుండా చూశారని, కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారని ఆరోపించారు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో వందల సంఖ్యలో గోవులు మరణించాయంటూ పోస్టులు పెట్టారు.








వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు:



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.

మేము సంబంధిత వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను యాక్సెస్ చేశాం. "NEWS ON THE DEATH OF 100 COWS IN TTD IS A FAKE _ టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం" అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది.

"టిటిడి గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవుల పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టిటిడి ఖండిస్తోంది.ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరుతోంది." అంటూ ఆ కథనంలో ఉంది.

ఇక టీటీడి అధికార ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా అందులో కూడా "TTD strongly condemns the spread of false information intended to mislead devotees and the public. We request the devotees not to believe false news . #FakeNews #TTDClarification #TTD #DontSpreadRumours #FactCheck" అంటూ పోస్టు పెట్టారు.

"భక్తులను, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని TTD తీవ్రంగా ఖండిస్తుంది. భక్తులు తప్పుడు వార్తలను నమ్మవద్దని మేము అభ్యర్థిస్తున్నాము." అని వివరించారు.



మేము సంబంధిత వార్తా కథనాల కోసం వెతకగా టీటీడీ ఇచ్చిన వివరణతో పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

గోశాలలో గోవులు మృతిపై సోషల్ మీడియాలో చేస్తున్న వాస్తవం కాదని టీటీడీ అధికారులు తెలిపారని ఈ కథనాల్లో తెలిపారు. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని, దురుద్దేశంతో కొంత మంది మృతి చెందిన గోవుల పోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపిందంటూ కథనాల్లో తెలిపారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతోందన్నారు.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని టీటీడీ తెలిపింది. మృతి చెందిన గోవుల ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు ఫోటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోందని సోషల్ మీడియా ఖాతాలలోనూ, వెబ్సైట్ లోనూ తెలిపారు.


Claim :  గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News