ఫ్యాక్ట్ చెక్: ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో జర్నలిస్టు చనిపోలేదు. ఆయన లైవ్ లో ఉన్నప్పుడు పేలుడు సంభవించింది.

ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న లెబనీస్ జర్నలిస్టును లైవ్ లోనే

Update: 2024-10-10 05:24 GMT
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ లెబనాన్‌లో సైనిక దాడిని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందనే భయం ఆ దేశాల ప్రజలను వెంటాడుతూ ఉంది. ఇజ్రాయెల్‌తో 21 రోజుల కాల్పుల విరమణకు సమూహం మద్దతిస్తోందని హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ నయిమ్ ఖాస్సెమ్ కూడా సంకేతాలిచ్చారు. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వెంబడి లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. డమాస్కస్‌లోని నివాస భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు మరణించారని, కనీసం 11 మంది గాయపడ్డారని సిరియా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో లెబనాన్ సివిల్ డిఫెన్స్ సర్వీస్ కు చెందిన ఐదుగురు మరణించినట్లు కూడా ధృవీకరించారు. సివిల్ డిఫెన్స్ సెంటర్‌పై మిసైల్ దాడి జరిగింది. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ దాడిని ఖండించింది. ఇజ్రాయెల్ రెస్క్యూ, అంబులెన్స్ సిబ్బందిని కూడా చంపేస్తోందని, అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను విస్మరించినందుకు దోషి గా నిలబెట్టాలని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

లెబనాన్ కొత్త విద్యా సంవత్సరం నవంబర్ 4 కి వాయిదా వేశారు. అంతేకాకుండా దేశంలోని 75% ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయాలుగా మార్చారని ఐక్యరాజ్యసమితి అధికారి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై 1,100 కంటే ఎక్కువ వైమానిక దాడులను నిర్వహించింది. వైమానిక దాడుల ద్వారా ఆయుధాల గిడ్డంగులు, లాంచర్లు, టన్నెల్ షాఫ్ట్‌లు, స్నిపింగ్ స్థానాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది.

అయితే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న జర్నలిస్టులపై దాడులు చేసి చంపేస్తోందంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.


"ఇజ్రాయెల్ వ్యతిరేక ఇంటర్వ్యూను, ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న లెబనీస్ జర్నలిస్టు, లైవ్లోనే లేపేసిన ఇజ్రాయెల్ మిస్సైల్" అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ దాడిలో ఆ జర్నలిస్టు చనిపోయారంటూ సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెబుతున్నారు.



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. లైవ్ లో ఉండగా మిసైల్ దాడి జరగడం వాస్తవమే అయినా అతడు చనిపోయాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ పోస్టును గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకు సంబంధించి పలు కథనాలు మాకు లభించాయి.

"Caught On Camera: On Air Journalist Almost Hit By Israel's Missile, Screams In Horror" అనే టైటిల్ తో www.timesnownews.com లో కథనాన్ని చూడొచ్చు.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో లెబనీస్ జర్నలిస్ట్ 'ఫాది బౌడియా' కిందపడినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని కథనంలో నివేదించారు. మిరయా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ బౌడియా లైవ్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ క్షిపణి ఆయన ఇంటి ప్రక్కనే ఉన్న గోడలను తాకింది. ఈ దాడిలో కిటికీలు ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే బోడియా కేకలు వేస్తూ భద్రత కోసం పరుగులు తీయడం చూడొచ్చు. పేలుడులో అతను గాయపడ్డాడని నివేదికలు చెబుతున్నాయి. అంతే తప్ప మరణించినట్లుగా ఎలాంటి కథనాలు రాలేదు.

ఈ కథనాన్ని మేము క్యూగా తీసుకుని సంబంధిత కీవర్డ్స్ సాయంతో లెబనీస్ జర్నలిస్ట్ ఫాది బౌడియా గురించి వెతికాము. ఆయన క్షిపణి దాడుల్లో గాయపడ్డం నిజమే అయినా చనిపోలేదని పలు కథనాలు ధృవీకరించాయి.

ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ మీరు చూడొచ్చు.

Full View


ఇక మేము ఫాది బౌడియా అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా కనుగొన్నాం. ఆయన ఈ మిసైల్ ఘటనపై స్పందించినట్లుగా గుర్తించాం.




ఈ ఘటన గురించి తెలిసి కాల్ చేసిన, సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. "దేవునికి ధన్యవాదాలు చెబుతున్నా, నేను క్షేమంగా ఉన్నాను, మీడియా బాధ్యతలను కొనసాగించడానికి మేము తిరిగి వస్తాము." అని ఆయన ట్వీట్ లో వివరించారు.

ఇక ఆ తర్వాత కూడా ఫాది బౌడియా పలు మీడియా డిబేట్లలో పాల్గొన్నారు. చివరిగా అక్టోబర్ 9న కూడా ఆయన మీడియా డిబేట్ లో పాల్గొన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.



కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఫాది బౌడియా రిపోర్టింగ్ చేసినప్పుడు ఇజ్రాయెల్ మిసైల్స్ ఆయన ఉన్న చోటును తాకాయి. అయితే ఆయన ప్రాణాలు మాత్రం ఈ దాడిలో పోలేదు.


Claim :  ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న లెబనీస్ జర్నలిస్టును లైవ్ లోనే చంపేశారు
Claimed By :  social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News