ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కట్టిన పాఠశాలకు ప్రధాని మోదీ వెళ్లలేదు

ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పోటీలో నిలబడ్డారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ ఎంతో ధైర్యంగా;

Update: 2025-01-16 10:21 GMT

Delhi School

ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పోటీలో నిలబడనున్నారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ ఎంతో ధైర్యంగా ఉన్నారు, ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5, 2025న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8, 2025న ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొందరు నాయకులను చాలా గొప్పగా ఓ వైపు అభివర్ణిస్తూ ఉండగా, మరో వైపు ఇతర రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చేందుకు అనేక చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. తప్పుదారి పట్టించే ఎన్నో వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వీటన్నింటి మధ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ తరగతి గదిలో పిల్లలతో మాట్లాడుతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది, భారత ప్రధాని మోదీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన పాఠశాలలను సందర్శించి, అక్కడి పిల్లలతో ఆయన మాట్లాడారని వైరల్ పోస్టుల్లో తెలిపారు
“@ArvindKejriwal जी ने कहा था न कि एक दिन मोदी जी को भी स्कूल भेज के रहेंगे. भले रील बनाने के लिए गए , लेकिन गए तो सही वो भी केजरीवाल जी के बनाए स्कूल में. अपना बनाया एक सरकारी स्कूल भी नही दिल्ली के मुकाबले जहाँ रील बनाई जाए. Thank you Kejriwal ji ” హిందీ భాషలో ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు. ప్రధాని మోదీ అరవింద్ కేజ్రీవాల్ కట్టించిన స్కూల్ లోకి వెళ్లి వీడియోలను షేర్ చేస్తున్నారని ఈ పోస్టుల్లో ఉంది.



క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు 

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని పాఠశాలను సందర్శించినట్లు వీడియోలో లేదు. యూపీలోని వారణాసిలోని స్కూల్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా, వైరల్ వీడియో ఇటీవలిది కాదని, ఆ వీడియో 2023 సంవత్సరానికి చెందినదని తేలింది. ప్రధాని మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా చిత్రీకరించారని తెలుస్తోంది.

Savera News Kashi no.1 అనే యూట్యూబ్ ఛానల్ లో డిసెంబర్ 19, 2023న ‘काशी में स्कूल के बच्चों ने गीत गाकर पीएम मोदी जी का किया खास स्वागत’ అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేసారు.
Full View
School.ki.duniya అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ‘The school children gave a special welcome to PM Modi by singing a song in the Government School, Kashi. राजकीय विद्यालय,काशी में गीत गाकर स्कूल के बच्चों के द्वारा किया पीएम मोदी जी का खास स्वागत’ అంటూ వీడియోను షేర్ చేశారు. డిసెంబర్ 19, 2023న వీడియోను పోస్టు చేశారు.
“School kids welcome PM Modi with mesmerizing a song in Varanasi” అనే టైటిల్ తో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో వీడియోను షేర్ చేశారు. దీన్ని బట్టి వైరల్ వీడియో వారణాసికి సంబంధించిందని మేము ధృవీకరించాం. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారని, ఆ తర్వాత ఆయనకు పాఠశాల పిల్లలు ఘనస్వాగతం పలికారని వీడియో వివరణలో పేర్కొన్నారు. ప్రధానమంత్రికి పిల్లలు "నమస్తే జీ", "భారత్ మాతా కీ జై" "వందేమాతరం" అంటూ స్వాగతం పలికారు. అలాగే పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.
Full View
డిసెంబర్ 17, 2023న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని ప్రధాని మోదీ సందర్శించారని pmindia.gov.in వెబ్‌సైట్‌లో విజువల్స్ ఉన్నాయి. వాటిని ఈ లింక్ లో చూడొచ్చు.
వైరల్ వీడియోలో భారత ప్రధాని ఢిల్లీ స్కూల్‌లో పిల్లలతో ముచ్చటించలేదు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి, అరవింద్ కేజ్రీవాల్‌తో ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించిన పాఠశాలను భారత ప్రధాని మోదీ సందర్శించిన వీడియో ఇది
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News