ఫ్యాక్ట్ చెక్: తిరుమల స్పెషల్ దర్శనం టిక్కెట్ల ధరలను, లడ్డూ ధరలను తగ్గించలేదు

టికెట్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన చేయలేదని తిరుమ

Update: 2024-06-25 05:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి రాగానే టీటీడీలో కూడా మార్పులను మొదలుపెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే.శ్యామలరావు నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని.. తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలలో స్పెషల్ దర్శనం టికెట్ల ధరలు, లడ్డూల ధరలు తగ్గాయంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. గతంలో స్పెషల్ దర్శనం టికెట్ ధర 300 రూపాయలు ఉండగా.. 200 రూపాయలు చేశారని.. లడ్డూ ధర 50 రూపాయలు ఉండగా 25 రూపాయలుగా ఏపీ ప్రభుత్వం తగ్గించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

"*తిరుమల స్పెషల్ దర్శనం*
*గతంలో 300 /- లు*
*ఉన్నదాన్ని 200 /- లు తగ్గింపు.*

*లడ్డు 50 /- ఉన్నదాన్ని*
*25 /- చేసిన*
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.* " అంటూ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








 




ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

వైరల్ మెసేజీని పరిశీలిస్తే అందులో మనకు 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' అని ఉండడాన్ని గమనించవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిర్ణయాలు పాలకమండలి తీసుకుంటుంది.

టీటీడీ పాలకమండలికి సంబంధించిన నిర్ణయాల గురించి తెలుసుకోవడం కోసం మేము టీటీడీ అధికారిక ట్విట్టర్ పేజీని చూశాం. @TTDevasthanams ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదంటూ.. వివరణ ఇచ్చారు. ధరలలో ఎలాంటి మార్పులు లేవని భక్తులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండంటూ జూన్ 22న సూచించింది.



మరింత సమాచారం కోసం మేము టీటీడీ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేశాం. "శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు – టీటీడీ ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం – టీటీడీ" అంటూ కథనాన్ని ప్రచురించారు.

"తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది.
పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేయడమైనది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు – భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

ఈ రోజు కొన్ని వాట్స్అప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతున్నది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించగలరు. " అంటూ టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసిన ప్రకటనను కనుగొన్నాం.

https://news.tirumala.org/no-change-in-rs-300sedtickets-and-laddu-rates-ttd-urges-devotees-not-to-believe-fake-news-on-social-media-platforms/

మా పరిశోధనలో పలు తెలుగు మీడియా సంస్థలు కూడా తిరుమల స్పెషల్ దర్శనం టికెట్ల ధరలు తగ్గించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. టీటీడీ ఈ వదంతులను ఖండించిందని ధృవీకరించాయి.

https://tv9telugu.com/andhra-pradesh/tirumala-news-ttd-clarifies-on-social-media-
reports-on-special-darshan-ticket-price-and-laddoo-prices-details-here-1286039.html


https://telugu.samayam.com/andhra-pradesh/tirupati/ttd-has-given-clarity-on-tirumala-laddu-rate-reduced-news-on-social-media/articleshow/111191905.cms


కాబట్టి, తిరుమల స్పెషల్ దర్శనం టిక్కెట్ల ధరలను, లడ్డూ ధరలను తగ్గించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు


Claim :  తిరుమల స్పెషల్ దర్శనం టికెట్ల ధర 300 రూపాయల నుండి 200 రూపాయలకు తగ్గించారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News