ఫ్లై ఓవర్‌పై బైక్లు జారిపడుతున్న వీడియో హైదరాబాద్‌లోనిది కాదు

వర్షం తరువాత ఫ్లైఓవర్‌పై బైక్‌లు స్కిడ్ అవుతున్న వీడియో హైదరాబాద్‌కు చెందినదనీ, హైదరాబాద్ లోని టోలిచౌకి-షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పైన ఈ ఘటన చోటుచేసుకుందన్న వాదనతో ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

Update: 2022-06-28 04:30 GMT

వర్షం తరువాత ఫ్లైఓవర్‌పై బైక్‌లు స్కిడ్ అవుతున్న వీడియో హైదరాబాద్‌కు చెందినదనీ, హైదరాబాద్ లోని టోలిచౌకి-షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పైన ఈ ఘటన చోటుచేసుకుందన్న వాదనతో ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

వాట్సాప్‌తో సహా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వైరల్ గా మారింది. లింక్లు ఇక్కడ చూడొచ్చు.

Please avoid tolichowki shaikpet flyover. Specifically in rain

https://www.facebook.com/rosenewstvwasimsyed/videos/1204875416976348/

హైదరాబాద్ : షేక్ పేట్ ఫ్లై ఓవర్ పై జారీ పడుతున్న బైక్స్.

Full View

https://twitter.com/RAMAKRI53791146/status/1541092735305674752

ఆర్కైవ్ లింక్:

https://web.archive.org/web/20220627080740/https://twitter.com/RAMAKRI53791146/status/1541091436778643461

నిజ నిర్ధారణ:

హైదరాబాద్‌లోని టోలీచౌకి-షేక్‌పేట్ ఫ్లైఓవర్ పరిస్థితిని వైరల్ వీడియో చూపుతోందన్న వాదన అబద్దం.

మొదటగా, హైదరాబాద్‌లో వర్షం తర్వాత మోటార్ బైక్‌లు జారిపడిపోవడం అనే సంఘటన జరిగినట్టు ముఖ్యమైన పత్రికలలో కథనాలు ప్రచురించలేదు. స్థానిక ఛానళ్లు కూడా అలాంటి ఘటన గురించి ప్రస్తావించలేదు.

వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించిన తర్వాత, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఉర్దూ టైటిల్‌తో ఒక యూట్యూబ్ వీడియో ఒకటి దొరికింది. జూన్ 23, 2022న పాకిస్తాన్‌కు చెందిన క్యాపిటల్ టీవీ అనే న్యూస్ ఛానెల్ ప్రచురించిన "కరాచీలో వర్షం తర్వాత చాలా మంది వాహనదారులు క్రాష్ అయ్యారు" అని టైటిల్ పేర్కొంది.

Full View

అందులో నుంచి క్యూ తీసుకొని, "కరాచీలో బైక్‌ల స్కిడ్డింగ్" అనే కీవర్డ్‌లతో శోధించినప్పుడు, పాకిస్తానీ వెబ్‌సైట్‌ల నుండి ఫలితాలు ఎన్నో లభించాయి.

నివేదికల ప్రకారం, డజన్ల కొద్దీ ప్రయాణికులు వంతెనపై జారిపడి గాయపడినట్లు తెలుస్తోంది.

https://en.dailypakistan.com.pk/23-Jun-2022/watch-scores-of-bikes-skid-as-first-monsoon-rain-turns-karachi-roads-to-butter

https://racks.pk/2022/06/23/scores-of-bikes-skid-as-first-monsoon-rain-turns-karachi-roads-to-butter/

ఈ కధనాలు జూన్ 22, 2022న ప్రచురించబడిన జర్నలిస్ట్ జియా ఉర్ రెహ్మాన్ చేసిన ట్వీట్‌ను పంచుకున్నాయి. "కరాచీలో వర్షాల సమయంలో జారుతూ ప్రమాదకరంగా మారిన రోడ్లు, జరుగుతున్న మోటార్‌సైకిల్ ప్రమాదాలు పెరుగుతాయి. ఇవి మిలీనియం మాల్‌లోని దృశ్యాలు. అల్లా అందరినీ క్షేమంగా ఉంచుగాక" అంటూ ఉర్దూ లో ఉన్న ట్వీట్ సారాంసం.



గూగుల్ మ్యాప్స్‌లో మిలీనియం మాల్ తో పాటు హోండా డ్రైవ్ ఇన్ కోసం వెతికినప్పుడు, గూగూల్ మ్యాప్స్ లో పంచుకున్న విజువల్స్ వైరల్ వీడియో విజువల్స్‌తో సరిపోలుతున్నాయి.

Claim :  Video of bike crashes on flyover is from Hyderabad
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News