ఫ్యాక్ట్ చెక్: సౌదీ అరేబియాలో దీపావళి రోజున టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారనేది నిజం కాదు

దీపావళి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ. కోట్లాది మంది హిందువులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల దీపాలు, రంగోలీ

Update: 2024-11-04 04:54 GMT

Saudi Arabia

దీపావళి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగ. కోట్లాది మంది హిందువులు దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. రంగురంగుల దీపాలు, రంగోలీలతో ఇళ్లను ముస్తాబు చేస్తారు. కుటుంబ సభ్యులు వివిధ రకాల బాణసంచా పేల్చి ఆనందిస్తారు. సైనికులతో కలిసి పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని సర్ క్రీక్‌ను సందర్శించి జవాన్లకు మిఠాయిలు అందించారు. 

అక్టోబరు 30, 2024న అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్‌లో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించారు. అయోధ్య రామమందిరంలో 28లక్షల దివ్వెలు వెలిగించారు. సరయూ నది ఘాట్‎లో 1100 మంది హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. పవిత్ర నగరంలో సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడితో సహా 55 ఘాట్‌లపై ఈ రెండు రికార్డులు నమోదయ్యాయి. 28 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించారు. 1,121 మంది వేదాచార్యులు ఏకకాలంలో 'ఆరతి' నిర్వహించారు. డ్రోన్‌లను ఉపయోగించి దీపాలను లెక్కించారు.

భారీ భవంతులు ఉన్న ప్రాంతంలో టపాసులు పేలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టపాసులు పేలుతూ ఉంటే కొందరు దాన్ని రికార్డు చేయడం మొదలుపెట్టారు. దీపావళిని సౌదీ అరేబియాలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు. “ कल असली मुसलमान अरब में दीपावली मना रहे थे और यहाँ सलवार वाले मातम मना रहे थे “ అంటూ పోస్టులు పెట్టారు. "నిజమైన ముస్లింలు దీపావళిని సౌదీ అరేబియాలో జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్లు మాత్రం ఎందుకో మౌనంగా ఉన్నారు" అనే అర్థం వస్తుంది.



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
ఇది దీపావళికి సంబంధించిన వీడియో కాదు. సెప్టెంబర్ 2024లో 94వ సౌదీ జాతీయ దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియో.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. వైరల్ వీడియో సెప్టెంబర్ 2024 నుండి ఆన్‌లైన్‌లో ఉందని మేము కనుగొన్నాము. సెప్టెంబర్ 23, 2024న ‘హ్యాపీ 94వ సౌదీ జాతీయ దినోత్సవం’ అనే శీర్షికతో YouTube లో అప్లోడ్ చేసిన వీడియోని మేము కనుగొన్నాము.
Full View
సౌదీ అరేబియా 94వ జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. ఈ వీడియో సౌదీ అరేబియా 94వ జాతీయ దినోత్సవం సందర్భంగా చిత్రీకరించబడలేదని మేము ధృవీకరించాము. 2024లో సౌదీ జాతీయ దినోత్సవానికి ముందే వీడియో ఆన్‌లైన్‌లో ఉంది.
ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు అదే వీడియోను సెప్టెంబర్ 19, 2024న “సౌదీ అరేబియా 94వ జాతీయ దినోత్సవానికి ముందుగా, నేను రాజ్యానికి, దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక రోజు దేశం గొప్ప వారసత్వం, విజయాలు, ఉజ్వల భవిష్యత్తును ప్రతిబింబించే సమయం కావచ్చు. ముందుగా సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు." అంటూ షేర్ చేశారు.
ఈ బాణసంచా వేడుక ఏ ప్రదేశం, ఏ తేదీలో జరిగిందో తెలుగుపోస్ట్ బృందం నిర్ధారించలేకపోయినప్పటికీ, ఇండియా టుడే ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, సౌదీ అరేబియాలోని రియాద్‌లో దేశం ఎక్స్‌పో 2030 హోస్టింగ్ హక్కులను గెలుచుకున్న తర్వాత ఇలాంటి బాణసంచా వేడుక జరిగింది. ఈ వేడుక నవంబర్ 2023లో జరిగింది.
'సౌదీ సెలబ్రేట్స్ బిడ్ విన్ ఫర్ ఎక్స్‌పో 2030' అనే కీవర్డ్‌లతో శోధించినప్పుడు మేము ఇలాంటి వీడియోలను కూడా కనుగొన్నాము.
మేము వీడియో ఖచ్చితమైన తేదీని నిర్ధారించలేకపోయినప్పటికీ, ఇది దీపావళికి సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  సౌదీ అరేబియాలో దీపావళి రోజున వీధుల్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News