ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్న బాబా, హత్రాస్ తొక్కిసలాటకు బాధ్యుడు కాదు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. వారిలో చాలా మంది మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం, భోలే బాబా పాదాల దగ్గర ఉన్న ధూళిని సేకరించడానికి మహిళలు ప్రయత్నించినప్పుడు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. వారిలో చాలా మంది మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం, భోలే బాబా పాదాల దగ్గర ఉన్న ధూళిని సేకరించడానికి మహిళలు ప్రయత్నించినప్పుడు అతడి భద్రతా సిబ్బంది నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. అనుకున్నదానికంటే చాలా ఎక్కువ మంది సత్సంగ్ కార్యక్రమానికి హాజరయ్యారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 80,000 మందికి అనుమతి తీసుకోగా.. ఏకంగా 2.5 లక్షల మంది వచ్చారు. నారాయణ్ సకర్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా హత్రాస్ వద్ద సత్సంగంలో ప్రసంగించారు. అతడు వెళ్ళిపోయాక తొక్కిసలాట జరిగింది.
ఒక వ్యక్తి గులాబీ రేకుల కుప్ప మధ్యలో కూర్చొని ఉన్నట్లు చూపించే వీడియో హత్రాస్ కు సంబంధించినదని పలువురు పోస్టులు పెడుతున్నారు. “వీడిని చూడటానికా హత్రాస్ లో 121 మంది చనిపోయింది” అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భోలే బాబా కాదు.
మేము వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని సెర్చ్ చేయగా.. ‘लो भाई अब मार्केट में आ गए 'वाइब्रेशन बाबा', फूलों के सेज में बैठकर करतब दिखाते Video हुआ वायरल’ అనే శీర్షికతో వైరల్ వీడియోను షేర్ చేసిన X ఖాతాను కనుగొన్నాము. వైబ్రేషన్ బాబా మార్కెట్ లోకి వచ్చారంటూ అందులో తెలిపారు.
వింధ్య భారత్ లైవ్ అనే ఛానెల్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి గుజరాత్‌కు చెందిన 'భరత్ మాది' అలియాస్ వైబ్రేషన్ బాబా అని తెలిపారు.
మేము వైబ్రేషన్ బాబా అనే కీవర్డ్‌లను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. వైబ్రేషన్ బాబా అని కూడా పిలువబడే భరత్ మాది అని ధృవీకరించే కొన్ని వెబ్ కథనాలను మేము కనుగొన్నాము.
నవభారత్ టైమ్స్ ప్రకారం.. భరత్ మాది కార్యక్రమాలకు వేలల్లోనూ, లక్షల్లోనూ ప్రజలు హాజరయ్యారు. కాగుతున్న నూనెలో చేయి పెట్టి ఆ నూనెను ముఖానికి రాసుకున్నారు. తనలో దైవిక శక్తి ఉందని ప్రజల కష్టాలను దూరం చేయగలడని కొందరు నమ్ముతారు. గుజరాత్‌లోని పంచమహల్, ఇతర సమీప జిల్లాలలో పాటోత్సవ్‌లో ప్రదర్శించిన జానపద పాటలలో పాల్గొనడం ద్వారా అతను తన ఉనికిని చాటుకున్నాడు. స్థానిక రాజకీయ నాయకులు కూడా అతనిని ఆశీర్వాదాలు కోరుతూ వస్తుండడంతో అతడికి పాపులారిటీ పెరిగింది.
హత్రాస్‌లోని సత్సంగ్ ను ఉద్దేశించి ప్రసంగించిన వ్యక్తి నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా.. ఆయనకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నివేదికల ప్రకారం, అతని అసలు పేరు సూరజ్ పాల్ సింగ్.. అతను 18 సంవత్సరాలు యుపి పోలీసు స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశాడు. తరువాత ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది.
భోలే బాబా ఫోటోను అనేక కథనాల్లో పంచుకున్నారు. వైరల్ వీడియోలో కనిపించే విజువల్స్‌కు భిన్నమైన వ్యక్తి భోలే బాబా అని తేలింది.
అందువల్ల, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తికి.. హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన బాబాకు ఎలాంటి సంబంధం లేదు.
Claim : 121 మందికి పైగా మరణించిన హత్రాస్ తొక్కిసలాటకు బాబా కారణమని వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By : Social media users
Fact Check : False