ఫ్యాక్ట్ చెక్: ఈ ఏడాది దీపావళి సందర్భంగా LOC వద్ద భారత్-పాకిస్థాన్ సైనికులు స్వీట్లు పంచుకోలేదు.

దీపావళిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు జరుపుకున్నారు. హిందూ, సిక్కు, జైన మతాలకు చెందిన వారికి ఇది ప్రధాన పండుగ;

Update: 2024-11-06 09:42 GMT
Soldiers exchange sweets at Kaman post, Soldiers exchange sweets on Republic day, facts on India-Pakistan Soldiers exchange sweets at border, factcheck news, viral news

Soldiers exchange sweets

  • whatsapp icon

దీపావళిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు జరుపుకున్నారు. హిందూ, సిక్కు, జైన మతాలకు చెందిన వారికి ఇది ప్రధాన పండుగ. ఎల్‌ఓసీలోని బారాముల్లా సెక్టార్‌లోని ఉరీలో భారత సైన్యానికి చెందిన జవాన్లు గ్రామస్థులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. సైన్యం, స్థానికుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, స్వీట్లు పంచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా సైనికులు, గ్రామస్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.

భారత సాయుధ దళాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగించారు. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ ఔట్‌పోస్టును సందర్శించిన ఆయన సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ దీపావళి పండుగ రోజున సైనికులతో గడుపుతున్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ నిర్వహించిన పరేడ్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఆర్మీలో చేరడం మాతృభూమికి సేవ చేయడానికి ఒక గొప్ప అవకాశం. దేశం మీ అచంచలమైన సంకల్పం, మీ అలుపెరగని ధైర్యసాహసాలు, అసమానమైన శౌర్యాన్ని చూసినప్పుడు గర్విస్తుందని మోదీ సైనికులతో అన్నారు.
2024లో దీపావళి సందర్భంగా సరిహద్దులో భారత్‌, పాకిస్థాన్‌ సైన్యాలు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటున్నాయంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోంది. “भारत पाकिस्तान बोर्डर पर दिवाली की मिठाई का आपस में लेना देना, ये दर्शाता है कि सारा गलत खेल केवल अंध भक्त और नेताओं का है, और कुछ आतंकियों का है।“ అంటూ హిందీలో పోస్టు పెట్టారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో దీపావళి సందర్భంగా స్వీట్లు పంచుకున్నారు. ఇలాంటి వాటిని చూసి కొందరు ఏమైపోతారో అంటూ అందులో తెలిపారు.


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియో పాతది. మేము వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ వీడియో 2017 సంవత్సరానికి చెందినదని మేము కనుగొన్నాము. 
అక్టోబర్ 18, 2017న ‘The Indian Army & Paki Army, exchanging Diwali gifts at the Kaman Post peace bridge, at the LOC.' అనే శీర్షికతో YouTube ఛానెల్ ద్వారా అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.
Full View
‘Kaman Setu, Uri (J&K): Sweets exchange ceremony between Indian & Pak Army on the occasion of 66th Republic Day’ అంటూ ANI ఎక్స్ లో పెట్టిన పోస్టును కూడా చూశాం. వైరల్ వీడియో దాని కంటే పాతదని మేము కనుగొన్నాము. ‘కమాన్ సేతు, ఉరి (J&K): 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత, పాక్ ఆర్మీ మధ్య స్వీట్ల మార్పిడి జరిగిందనే ANI షేర్ చేసిన చిత్రాలను మేము కనుగొన్నాము.
హెడ్‌లైన్స్ టుడే యూట్యూబ్ ఛానెల్ జనవరి 26, 2015న ‘R-day: ఇండియన్ సైనికులు పాక్ సైనికులతో స్వీట్‌లను పంచుకున్నారు'అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు. వీడియో వివరణలో 'గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తమ పాకిస్థానీ సైనికులకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం భారత సైనికులకు లభించింది. ఇది అమన్ సేతులో నిర్వహించచారు' అని ఉంది.
Full View
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, రిపబ్లిక్ డే సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని మూడు ప్రదేశాలలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్తాన్ సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. శ్రీనగర్ - ముజఫరాబాద్ రహదారిపై ఉరీ సెక్టార్‌లోని కమాన్ పోస్ట్ వద్ద ఆమ్రీకి చెందిన 12వ పదాతిదళ బ్రిగేడ్‌కు చెందిన ఒక యూనిట్ పాకిస్తాన్ సహచరులతో స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు. దీపావళి రోజున భారతదేశం, పాకిస్తాన్ సైనికులు స్వీట్లు పంచుకోలేదు. ఇది 2015 సంవత్సరంలో భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటు చేసుకున్నది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  భారత్, పాకిస్థాన్ సైనికులు దీపావళి సందర్భంగా LOC వద్ద మిఠాయిలు పంచుకున్నారు
Claimed By :  Twitter user
Fact Check :  Misleading
Tags:    

Similar News