అంబులెన్స్‌కు 20000 రూపాయలు అడిగారని, దీంతో ఓ తండ్రి తొక్కిసలాటలో మరణించిన తన కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న వీడియోను చూపుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోకు సంబంధించిన పోస్టులో “एक पिता को एम्बुलेंस तक नहीं मिली अपने बेटे के शव के लिए??? तिरुपति हादसे में जान गवाई थी मासूम ने.” అంటూ హిందీలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
హిందీ నుంచి అనువదించగా “తిరుపతిలో చనిపోయిన 12 ఏళ్ల చిన్నారిని తరలించేందుకు అంబులెన్స్ కోసం 20000 రూపాయలు అడిగారు.డబ్బు లేకపోవడంతో కొడుకు తండ్రి 90 కి.మీ. దూరం బైక్ పై తరలించారు." అంటూ వీడియో వైరైల్ అవుతున్నట్టు తెలుస్తోంది.క్లెయిం ఆర్కైవ్ లింకు ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియోలోని సంఘటన 2022 నాటిది.
తిరుపతి ఘటనలో మృతుల జాబితాను పరిశీలించగా బాధితురాలి జాబితాలో
బాలుడు లేరని తేలింది. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, “తిరుపతికి చెందిన వ్యక్తి కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి తన భుజాలపై మోయాల్సి వచ్చింది” అనే శీర్షికతో ఏప్రిల్ 27, 2022న వన్‌ఇండియా న్యూస్ ద్వారా వీడియో షేర్ చేశారని మేము కనుగొన్నాము.
ఆ వీడియో వివరణలో 'ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పట్టణంలో, ఒక వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని తన భుజాలపై మోయవలసి వచ్చింది. అతని ఇంటికి చేరుకోవడానికి 90 కిలోమీటర్లు స్కూటర్‌పై మృతదేహంతో ప్రయాణించవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు మృతదేహాన్ని తరలించడానికి 10,000 డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి ఇలా మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది' అని ఉంది.
(హెచ్చరిక: వీడియో లో సన్నివేశాలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, జాగ్రత్త వహించాలని సూచన)
ఏప్రిల్ 22, 2022 న
హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని బైక్ పై 90 కి.మీల దూరం స్కూటర్‌పై తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని తరలించడానికి ₹ 10,000 డిమాండ్ చేయడంతో ఆయన ఈ పని చేశారు. ఈ ఘటన తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మామిడి తోటల్లో కూలీ పని చేస్తున్న నరసింహులు తన పదేళ్ల కుమారుడి మృతదేహాన్ని స్ట్రెచర్‌పై నుంచి లేపి భుజాలపై ఎత్తుకుని బైక్‌పై తీసుకుని వెళ్తున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానిక టెలివిజన్ ఛానెల్‌లు ఈ వార్తలను ప్రసారం చేయడంతో, తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి విచారణకు ఆదేశించారు. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.సరస్వతీ దేవిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అధికారులు "అంబులెన్స్ మాఫియా" ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కె భారతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అంబులెన్స్‌లో తీసుకుని వెళ్ళడానికి ఆ తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన కొడుకు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్నట్లు చూపించే వైరల్ వీడియో ఇటీవలిది కాదు. తిరుపతి తొక్కిసలాట సంఘటనకు సంబంధించింది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.