ఫ్యాక్ట్ చెక్: శక్తివంతమైన పేలుడుకు సంబంధించిన వైరల్ వీడియోకు సంబంధించి తప్పుడు వాదన చేస్తున్నారు. ఇది బీరుట్ నౌకాశ్రయంలో జరిగింది కానీ ఒడెస్సా పోర్ట్ వద్ద కాదు
భారీ పేలుడు కారణంగా ఓడరేవు, పరిసర ప్రాంతాలు ధ్వంసం అయినట్లు చూపించే వీడియో కోల్లెజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయంలో రెండు బ్రిటిష్ కార్గో షిప్‌లను నాలుగు రష్యన్ క్షిపణులు తాకడంతో భారీ పేలుడు చోటు చేసుకుంది.
2020లో బీరుట్ పోర్ట్‌లో జరిగిన శక్తివంతమైన పేలుడుకు సంబంధించిన వైరల్ వీడియో ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్ట్‌లో చోటు చేసుకున్న పేలుడుగా ప్రచారం జరుగుతూ ఉంది
భారీ పేలుడు కారణంగా ఓడరేవు, పరిసర ప్రాంతాలు ధ్వంసం అయినట్లు చూపించే వీడియో కోల్లెజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయంలో రెండు బ్రిటిష్ కార్గో షిప్‌లను నాలుగు రష్యన్ క్షిపణులు తాకడంతో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌కు పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న బ్రిటీష్ ఓడను రష్యా మిసైల్స్ తాకాయి" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. విజువల్స్ 2020 సంవత్సరంలో లెబనాన్‌లోని బీరుట్ పోర్ట్‌లో పేలుడుకు సంబంధించినవని స్పష్టంగా చెబుతున్నాయి.
మేము వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. 2020 సంవత్సరంలో అప్లోడ్ చేసిన అదే వీడియోను షేర్ చేసిన అనేక రిపోర్ట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము.
బీరుట్ లో జరిగిన ఈ పేలుడు ధాటికి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5,000 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. ఈ పేలుడు కారణంగా సుమారు 140 మీటర్ల వెడల్పు రంధ్రం ఏర్పడింది.
అదే విజువల్స్ ను ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. "మీ జీవితంలో ఇంతకంటే భయంకరమైన దాన్ని అనుభవించలేరు. ఈ పేలుడు 2020లో బీరుట్‌లో జరిగింది. దాని గురించి మాకు తెలుసు, అయితే వీడియో వివిధ కోణాల నుండి పేలుడుకు సంబంధించిన రికార్డింగ్‌లను చూపిస్తుంది. నిజంగా ఇలాంటి అనుభవాలు ఎంతో భయానకంగా ఉంటాయి." అని అందులో ఉంది.
(“The scariest thing you can experience. This explosion happened in Beirut in 2020 and of course, we knew about it but the video shows the explosion and recordings from different angles and captures how frightening war and experiences like this truly are.”) అంటూ పోస్టు పెట్టిన లింక్ ను మీరు చూడవచ్చు.

Global News అనే యూట్యూబ్ ఛానల్ లో “Beirut explosion: Video shows a new angle of the massive blast” అంటూ వీడియోను పోస్టు చేశారు.
పేలుడుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ “Explained: What happened in deadly Beirut explosion” ఈ శీర్షికతో ప్రచురించింది
ది గార్డియన్‌లోని ఒక నివేదిక.. వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది.
ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలోని బ్లాక్ సీ ఓడరేవుపై దాడికి సంబంధించిన వీడియోను ది గార్డియన్ ప్రచురించింది. రష్యా ధాన్యం ఉన్న ప్రాంతాలు, ఓడరేవుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.
వైరల్ వీడియో 2020లో బీరూట్ పేలుడుకు సంబంధించినది.. ఉక్రెయిన్‌లోని ఒడెస్సాకు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Video shows the explosion at Odessa port in Ukraine
Claimed By : Social Media Users
Fact Check : Misleading