Battery Lift Accident: ఈవీ బ్యాటరీ పేలుడుకు సంబంధించిన వైరల్ వీడియోలో నిజా నిజాలు ఇవి

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని ఇంటికి తీసుకుని వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని తిరిగి

Update: 2024-07-26 02:28 GMT

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని ఇంటికి తీసుకుని వెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని తిరిగి వచ్చి మళ్లీ బైక్ లో పెట్టి వాడుతూ ఉంటారు. అయితే ఓ ఎలెక్ట్రిక్ బైక్ బ్యాటరీ లిఫ్ట్ లో పేలిపోయిన ఘటన గురించి చర్చ జరుగుతూ ఉంది. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇ-బైక్ బ్యాటరీ పేలిన ప్రమాదకర సంఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది. లిఫ్ట్‌లో పేలుడు సంభవించి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన, 2021 సంవత్సరంలో చోటు చేసుకుంది. లిఫ్ట్ లోకి తీసుకుని వెళ్లిన వెంటనే బ్యాటరీ పేలిపోవడం చూడొచ్చు. ఈ-బైక్ బ్యాటరీని పట్టుకున్న వ్యక్తికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

28 ఏళ్ల యువకుడు చైనా నౌకాశ్రయ నగరమైన గ్వాంగ్‌జౌలోని భవనం లిఫ్ట్‌లోకి బ్యాటరీని తీసుకువెళుతున్నప్పుడు చూడవచ్చు. అతను క్రిందికి వెళ్ళడానికి బటన్‌ను నొక్కాడు. తలుపులు మూసివేయగానే బ్యాటరీ లో నుండి మంటలు వ్యాపించేశాయి. చైనాలోని స్థానిక మీడియా నివేదికల ప్రకారం 28 రోజుల తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు. ఫుటేజ్‌లో బ్యాటరీ మంటలు వ్యాపించే ముందు పొగ రావడం, పేలడం చూడవచ్చు. స్థలం తక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చాలా త్వరగా మంటల్లో చిక్కుకుంది. వ్యక్తి తీవ్రంగా కాలిపోయాడు. ఇతర వ్యక్తులు కాలిపోయిన శరీరాన్ని చూసి సహాయం కోసం పరుగులు పెట్టారు.


అసలు నిజం ఇదే: 

ఈ వీడియోకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. బ్యాటరీలో సమస్య కారణంగా ఈ పేలుడు సంభవించింది తప్పితే.. ఈవీ బ్యాటరీలను లిఫ్ట్ లో తీసుకుని వెళ్తే పేలుడు సంభవించడం జరగదు. ఎన్నో సేఫ్టీ టెస్ట్ లు చేసిన తర్వాతనే బ్యాటరీలను ఈవీలలో వాడుతారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలలో సమస్యలు వస్తే థర్మల్ రన్‌అవేకి కారణమవుతుంది.. అప్పుడు అది పేలుడుకు కారణమవుతుంది. థర్మల్ రన్‌అవేని నిరోధించడానికి పలు భద్రతా పరిణామాలను పాటిస్తారు. అలా చేయడం వలన బ్యాటరీ సెల్ వేడెక్కడం, అగ్ని ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితి వంటివి ఇకపై జరగవు. లిఫ్ట్ లోకి తీసుకుని వెళ్ళగానే బ్యాటరీలు పేలడం అన్నది చాలా అరుదు. EV బ్యాటరీల భద్రతా రికార్డును ఇవి ప్రతిబింబించవు.

వీడియో నిస్సందేహంగా భయాందోళనలు గురి చేస్తున్నప్పటికీ.. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం చాలా ముఖ్యం. ఈ సంఘటన EV బ్యాటరీలను తయారు చేయడం, క్వాలిటీపై మరింత బాధ్యతగా వ్యవహరించాలనే సందేశాన్ని ఇస్తుంది. అంతే తప్ప ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక ప్రయోజనాలను తగ్గించదు. 

Tags:    

Similar News