కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ లో ఉద్రిక్తత.. రెచ్చిపోయిన క్యాడర్
హైదరాబాద్ లో కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఖైరతాబాద్ వద్ద కార్యకర్తలు వాహనాలను తగుల పెట్టారు.
హైదరాబాద్ లో కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఖైరతాబాద్ వద్ద పార్టీ కార్యకర్తలు వాహనాలను తగుల పెట్టారు. ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి దేశమంతా పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోనూ నేతలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరారు.
నేతల అరెస్టులు...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లు వచ్చే లోగా ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై తగులపెట్టారు. ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వాహనాలను ధ్వంసం చేశారు. టైర్లను రోడ్లపై వేసి కాలబెట్టారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపునకు చొచ్చుకు వెళ్లారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. చివరకు మల్లు భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.