హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్

హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది;

Update: 2024-11-08 04:08 GMT

హైద్రాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. చిట్యాల మండల వెలిమినేడు వద్ద లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం హైదరాబాద్ కు చేరుకోవాల్సిన వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.

క్లియర్ చేసేందుకు...
దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.లారీ రోడ్డుకు అడ్డంగా పడడం తో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లారీని క్రేన్ ద్వారా పక్కకు తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపైనే నిలిచిపోయాయి.


Tags:    

Similar News