బాబూ.. అలాంటి పాటలైతే హైదరాబాద్ లో పాడొద్దు!!

పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తన

Update: 2024-11-15 05:53 GMT

పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తన “దిల్-లుమినాటి టూర్”లో భాగంగా నవంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంగీత కచేరీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మద్యం, మాదక ద్రవ్యాలు, హింసను ప్రోత్సహించే పాటలు పాడవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్వాహకులకు నోటీసు జారీ చేసింది. దిల్జిత్ తన ప్రదర్శనలో భాగంగా పిల్లలను వేదికపై ఉపయోగించకూడదని తెలిపారు. ఈవెంట్ సమయంలో పెద్ద శబ్దాలు, ఫ్లాషింగ్ లైట్లు పిల్లలకు హానికరం అని నోటీసులో పేర్కొన్నారు.

దిల్జిత్ లైవ్ షో వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. అక్టోబర్ 26-27 తేదీల్లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేడియంలో అపరిశుభ్రత చూసి అందరూ షాక్ అయ్యారు. ఢిల్లీలో మద్యం, డ్రగ్స్, హింసను ప్రోత్సహించే పాటలను పాడారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ముందస్తుగా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News