Hyderabad : హైదరాబాద్‌లో హెల్మెట్ లేని కేసులు ఈ ఏడాదిలో ఏన్నో తెలుసా?
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాదిలో హెల్మెట్ లేని కేసులు మూడు లక్షలకు పైగా నమోదయ్యాయి
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాదిలో హెల్మెట్ లేని కేసులు మూడు లక్షలకు పైగా నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారు విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను అమలులోకి తెచ్చారు. నిన్నటి నుంచి హైదరాబాద్ నగరంలో మరొక సారి హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని చోట్ల కౌన్సిలింగ్ ను విధిస్తూ తొలి తప్పిదం కింద వది పెడుతున్నారు.
ఒక్కరోజులో 1600 కేసులు...
ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో ఈరోజు హెల్మెట్ లేని వాహనాల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈఒక్కరోజులోనే 1600 కేసుల వరకూ నమోదయినట్లు తెలిసింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి లోనైతే ప్రాణాలు కోల్పోతారని తెలిసినా అనేక మంది హెల్మెట్ ధరించడానికి ఇష్టపడటం లేదు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ను కంపల్సరీ చేశారు. నిన్నటి నుంచి నగరంలో ఎక్కడ చూసినా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు.