Big Breaking : నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు అయ్యాయి;

Update: 2024-01-10 04:08 GMT
Big Breaking : నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం
  • whatsapp icon

నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు అయ్యాయి. ఒకరు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. నాంపల్లి రైల్వే స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వార్త తెలిసిన వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

యాభై మందికి గాయాలు...
ప్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టడంపై రైల్వే అధికారులు విచారణ జరుపుతామంటున్నారు. అసలు సైడ్ వాల్ కు ఎలా ఢీకొట్టిందన్న దానిపై విచారణ సాగనుంది. గాయపడిన యాభై మంది ప్రయాణికులను ఆసుపత్రికి పంపి చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో మిగిలిన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.


Full View


Tags:    

Similar News