హైదరాబాద్ కు హైఅలర్ట్... ఈదురుగాలులు.. భారీ వర్షం
రాబోయే 12 గంటల పాటు హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ హెచ్చరించింది.
రాబోయే 12 గంటల పాటు హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 12 గంటల పాటు ఈదురు గాలులు, భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. చెట్ల కింద నిలబడ వద్దని కూడా హెచ్చరించింది.
వాహనదారులు...
హైదరాబాద్ లో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 12 గంటల పాటు ఈదరు గాలులు వీస్తాయని, తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. ప్రధానంగా వాహనదారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది. ప్రమాదాలు జరగకుండా జీహెచ్ఎంసీ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజల నుంచి సహకారం కావాలని కోరుతుంది.