పెరుగుతున్న వరద.. పాఠశాలలకు సెలవు

తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొరలుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి

Update: 2022-07-27 04:07 GMT

తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొరలుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ ఈరోజు సెలవు ప్రకటించారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీరు రోడ్లపైకి వస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

నగరంలో వంతెనలపై...
అవసరముంటేనే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచించారు. ఇక హైదరాబాద్ లోని జలాశయాలకు కూడా పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతుంది. గండిపేట రిజర్వాయర్ లో 12 గేట్లు ఎత్తి వేశారు. హిమాయత్ సాగర్ లో 8 గేట్లను ఎత్తి వేశారు. ముసారాం బ్రిడ్జి, చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.


Tags:    

Similar News