ప్రధాని మోదీ బహిరంగ సభ వేదిక వెలుపల ఆకాశంలో 'జై కేసీఆర్' బెలూన్లు

హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మధ్య బ్యానర్ వార్ కొనసాగగా

Update: 2022-07-03 14:25 GMT

హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మధ్య బ్యానర్ వార్ కొనసాగగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ వేదిక అయిన పరేడ్ గ్రౌండ్స్ వెలుపల పింక్ బెలూన్ల రూపంలో మరో వివాదం చెలరేగింది.రాష్ట్ర ప్రభుత్వ విజయాలతో బీజేపీ పోస్టర్లను సమర్థంగా ఎదుర్కొంటూ గత మూడు రోజులుగా టీఆర్‌ఎస్ దూకుడుగా వ్యవహరించింది. చాలా ప్రాంతాల్లో పోటాపోటీగా బ్యానర్లను టీఆర్ఎస్ తీసుకుని వచ్చింది. ఇక ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ 'జై జై కేసీఆర్' నినాదంతో కూడిన గులాబీ బెలూన్‌లు వేదిక వెలుపల కనిపించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం వేదిక నుండి కనిపించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు నగరంలో బీజేపీకి వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిశాయి. ప్రధాని ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని పోస్టర్లలో టీఆర్ఎస్ ఆరోపించింది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిందని.. టీఆర్‌ఎస్‌ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజాధనాన్ని ఫ్లైక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు స‌మావేశాలను వీడియో తీస్తూ క‌నిపించారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ నేత‌లు స‌ద‌రు అధికారిని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారిన‌ని చెప్ప‌గా.. ఆయ‌న తీరుపై బీజేపీ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను స‌మావేశాల నుంచి బ‌య‌ట‌కు పంపేశారు.


Tags:    

Similar News