ఐకియాకు కేటీఆర్ కీలక సూచన.. ఏంటంటే?

వినియోగదారులందరినీ గౌరవించేలా సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఐకియా సంస్థను కోరారు.

Update: 2022-08-29 13:49 GMT

వినియోగదారులందరినీ గౌరవించేలా సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఐకియా సంస్థను కోరారు. హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో మణిపూర్ కు చెందిన మహిళకు జరిగిన అవమానాన్ని ఆమె భర్త కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా షోరూం ప్రతిష్టను కాపాడాలని, అందరినీ గౌరవించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.

వివక్షతతో....
హైదరాబాద్ లోని ఐకియా షోరూంలో మణిపూర్ కు చెందిన మహిళ వస్తువులను కొనుగోలు చేసింది. అయితే ఆ వస్తువులను తనిఖీ చేయడం వరకూ ఓకే. కాని గంటల కొద్దీ అనుమానంతో ఆ మహిళను సిబ్బంది నిరీక్షించేలా చూశారు. ఆమె కంటే ముందుగా వెళ్లిన వారిని తనిఖీ చేయలేదు. ఆమెను ఐకియా సిబ్బంది అనుమానంగా చూడటంతో ఆమె అవమానంగా ఫీలయింది. ఒంటరిగా ఉంచి సిబ్బంది అవమాన పర్చేలా వ్యవహరించారని, వివక్ష పూరితంగా ఐకియా సిబ్బంది వ్యవహరించారని ఆమె భర్త చేసిన ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. దీనికి ఐకియా షోరూం సమాధానం చెప్పింది. తనిఖీల సమయంలో అందరినీ చెక్ చేస్తారని చెప్పింది. చెకింగ్ లో అది ఒక భాగమని, ఇక్కడ ఎలాంటి వివక్ష ఎవరిపైనా చూపించలేదని ఐకియా షోరూం పేర్కంది.


Tags:    

Similar News