కార్పొరేటర్ పై కేటీఆర్ సీరియస్... చర్యలు తీసుకోమని ఆదేశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-04-06 06:02 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే భోలక్ పూర్ కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ తన ప్రాంతంలోని హోటళ్లను మూసివేయడానికి వచ్చిన పోలీసులపై చిందులు తొక్కాడు. ఒక నెలరోజులు ఇటు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. రంజాన్ మాసంలో రాత్రంతా హోటళ్లు తెరిచే ఉంటాయని, ఇటు వైపు రావద్దని కూడా గౌసుద్దీన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు.

వైరల్ కావడంతో.....
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంఐఎం కార్పొరేటర్ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు ఇచ్చిన వార్నింగ్ ను పలువురు నెటిజన్లు తప్పపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసుల విధులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన నేత అయినా వదలొద్దని కేటీఆర్ డీజీపీని కోరారు. ఇటువంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం సమర్థించదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News