Hyderabad : వాహనదారులకు భారీ ఊరట

తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలానాదారులకు ఊరట కల్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2022-02-23 12:36 GMT

తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలానాదారులకు ఊరట కల్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లక్షల సంఖ్యలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 600 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే ఎన్ని సార్లు చెప్పినా వాహనదారులు చెల్లించకపోవడంతో తెలంగాణ పోలీసు శాఖ భారీ రాయితీలను ఇచ్చింది.

భారీ రాయితీలు....
టూ వీలర్ అయితే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న చలాన్లపై 75 శాతం రాయితీ కల్పించింది. కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 80 శాతం రాయితీ కల్పిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక తోపుడు బండ్లకు కూడా 80 శాతం రాయితీ ఇచ్చింది. మార్చి 1 నుంచి 30వ తేదీ వరకూ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. పెండింగ్ చలానాలను చెల్లించి వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.


Tags:    

Similar News