Cold Winds : తెలంగాణలో చలి చంపేస్తుందిగా.. ఉష్ణోగ్రతలు పడిపోయి?

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత కొద్ది రోజులుగా ఉదయం నుంచి చలి గాలులు వీస్తున్నాయి.

Update: 2024-11-20 03:43 GMT

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత కొద్ది రోజులుగా ఉదయం నుంచి చలి గాలులు వీస్తున్నాయి. దీంతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఫ్యాన్ వేసుకోవడం కూడా కష్టంగా మారింది. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. చలికి వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మార్కింగ్ వాకర్స్ కూడా చలికి తట్టుకోలేక సాయంత్రం వాక్ చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో దుప్పట్లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఉదయం పది గంటల వరకూ చలి తీవ్రత తగ్గడం లేదు. పది గంటల తర్వాత మాత్రం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. ఆ సమయంలోనే ఎక్కువ మంది హైదరాబాద్ నగరంలో బయటకు వస్తున్నారు.

కనిష్ట ఉష్ణోగ్రతలు...
ప్రధానంగా తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గొంతునొప్పి, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో నవంబర్ నెలలోనే ఇంతటి చలితీవ్రత ఎప్పుడూ చూడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చలి తీవ్రత పెరగడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి కాపాడుకునేంందుకు స్వెట్టర్లు, మంకీ క్యాప్ లు వంటివి ధరించి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని మెదక్ లో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న కాలంలో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News