హైదరాబాద్ లో భారీ వర్షం.. హై అలెర్ట్
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు నగర వాసులకు హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు.
కుండపోత....
మరో గంటలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రజలు మ్యాన్ హోళ్లను తెరవవద్దని, ఆ పని జీహెచ్ఎంసీ సిబ్బంది చూసుకుంటుందని చెబుతోంది. రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతుంది.