12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న అవిభక్త కవలలు

వీణా-వాణి.. వీరి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు పుట్టినప్పటి నుండి ఆసుపత్రిలో పెరిగారు. హైదరాబాద్‌కు చెందిన కవలలు వీణా, వాణి అసమానతలను అధిగమించి ఇప్పుడు 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు.

Update: 2022-05-11 05:18 GMT

వీణా-వాణి.. వీరి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు పుట్టినప్పటి నుండి ఆసుపత్రిలో పెరిగారు. హైదరాబాద్‌కు చెందిన కవలలు వీణా, వాణి అసమానతలను అధిగమించి ఇప్పుడు 12వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరు పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డ్‌ ప్రత్యేక సౌకర్యాలు కల్పించినప్పటికి వాటిని ఈ ఇద్దరు కవలలు సున్నితంగా తిరస్కరించారు.

ఈనెల 6వ తేదిన ప్రారంభమైన ఇంటర్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్నారు వీణా-వాణి. ఇంటర్‌ ఎగ్జామ్స్ రాస్తున్న వీణా-వాణిలు ఎవరి సహకారం లేకుండానే పరీక్షలు రాస్తున్నారని ఎగ్జామ్‌ ఇన్విజిలెటర్స్ చెబుతున్నారు. ఇద్దరి తలలు అతుక్కొని ఉండటం కారణంగా ఎగ్జామ్స్‌లో ఒకరికొకరు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేసుకుంటున్నారా అని అధికారులు వేసిన ప్రశ్నలకు వీణా, వాణి ఒకే సమాధానం ఇచ్చారు. అలాంటిది లేదని తాము ఒకరితో మరొకరు పోటీ పడి చదువుతున్నామని, పరీక్షలు కూడా అలాగే రాస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ ట్యాలెంట్ తోనే మెరిట్ సాధించాలని అనుకుంటున్నామన్నారు. తమకు ఇచ్చిన అదనపు సమయాన్ని కూడా ఉపయోగించుకోకూడదని తెలిపారు.

కవలల పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్ అరుణ మాట్లాడుతూ.. వారు తమ పరీక్షను ఇచ్చిన సమయానికి ఐదు నిమిషాల ముందే పూర్తి చేశారని తెలిపారు. "మేము చాలా వేగంగా వ్రాస్తాము" అని వాణి చెప్పింది. వాణి, వీణ మాట్లాడుతూ చార్టర్డ్ అకౌంటెంట్లు కావాలని అనుకుంటున్నామని తెలిపారు. "చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలనేది మా ఆశయం. అందుకే 12వ తేదీ తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరి చార్టర్డ్ అకౌంటెంట్లు అవుతాను" అని వాణి తెలిపింది.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మి దంపతులకు 2003లో తలలు అతుక్కొని పుట్టిన ఇద్దరు కవలలు వీణా-వాణి..అప్పటి నుంచి వారికి దూరంగా 12 సంవత్సరాల వరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో గడిపారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టేట్‌ హోమ్‌లో గడుపుతున్నారు. వీరిని విడదీయాలని వైద్యులు ప్రయత్నిస్తున్నా కూడా వీలు పడడం లేదు.
Tags:    

Similar News