హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 24 గంటలు వాటర్ సప్లై బంద్

నగర వాసులకు 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలో పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా వాటర్

Update: 2022-04-10 10:26 GMT

హైదరాబాద్ : నగర వాసులకు 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలో పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2కి మరమ్మతులు చేయాల్సి ఉంది. పటాన్‌చెరు నుంచి హైదర్‌గూడకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్‌కు ఏర్పడ్డ లీకేజీల నివారించేందుకు ఆర్‌.సి పురంలోని లక్ష్మీ గార్డెన్, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద మరమ్మతు పనులను అధికారులు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ మరమ్మతు పనులు జరగనున్న నేపథ్యంలో.. 24 గంటలపాటు వాటర్ సప్లై నిలిచిపోనుంది.

బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్‌ నగర్‌ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.




Tags:    

Similar News