చెన్నై అంతర్జాతీయ బౌద్ధ సదస్సును ఆకట్టుకున్న బుద్ధవనంపై ప్రసంగం -డా. ఈమని శివనాగిరెడ్డి, కన్సెల్టెంట్, బుద్ధవనం
చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం;
చెన్నై / హైదరాబాదు / నందికొండ, నవంబర్, 29: చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్‌లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం, నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుపై చేసిన పరవ్‌పాయింట్ ప్రజంటేషను సబికులను ఆకట్టుకొందని, బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ ఎక్స్‌పర్ట్ కన్సెల్టెంట్, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఎంగేజ్డ్ బుద్ధిస్ట్ నెట్‌వర్క్, తమిళ్ బుద్ధిస్ట్ సొసైటీ ‘బుద్ధిస్ట్ హెరిటేజ్ టు వర్ట్స్ ఇంక్లూజివ్ సొసైటీస్’ అన్న అంశంపై నిర్వహిస్తున్న 21వ ద్వైవార్షిక సమావేశంలో శుక్రవారం నాడు, ఆయన ముఖ్య అతిథిగా హాజరై, బుద్ధవనం ప్రత్యేకతలపై ప్రసంగించారు. ఆ ప్రసంగంలో నాగార్జునకొండ చరిత్ర, ఆచార్య నాగార్జునుని రచనలు, తెలంగాణాలో బౌద్ధ ధర్మవ్యాప్తి, స్థావరాలపై వివరించారు. శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ నుంచి సదస్సుకు హాజరైన బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు, బుద్ధవనాన్ని సందర్శించటానికి ఆసక్తి చూపారని, వారందరికీ బుద్ధవనం బ్రోచర్లను బహూకరించినట్లు శివనాగిరెడ్డి చెప్పారు. తరువాత నిర్వాహకుల తరఫున గౌతమ్‌ప్రభు, విజయన్, బుద్ధవనంపై ప్రసంగకర్త, బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డిని బౌద్ధ పద్ధతిలో సత్కరించారు.