ఐసిస్ ఉగ్రవాదులే టార్గెట్‌గా సిరియాపై అమెరికా దాడులు

సిరియాపై అమెరికా దాడులకు దిగింది. బాంబులతో విరుచుకుపడింది

Update: 2024-10-12 12:42 GMT

సిరియాపై అమెరికా దాడులకు దిగింది. బాంబులతో విరుచుకుపడింది. ఐసిస్ ఉగ్రవాదులను టార్గెట్‌గా చేసుకుని ఈ అగ్రరాజ్యం అమెరికా ఈ దాడులకు పాల్పడింది. పలు దఫాలుగా వైమానిక దాడులు చేయడంతో సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు తామే సిరియా ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులకు దిగినట్లు ప్రకటించింది. ఐసిస్ అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు దాని మిత్ర పక్ష దేశాలపై దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం అందడంతో అమెరికా ముందుగానే ఈ దాడులకు దిగిందని చెప్పుకొచ్చింది.

సామాన్య పౌరులకు ఎవరికీ...
అయితే ఈ దాడుల్లో అమెరికా ఒక యుద్ధనీతిని పాటిస్తోంది. సిరియాలో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగానే చేసుకుని దాడులకు దిగడం తప్ప సామాన్య ప్రజలు ఈ దాడులకు బలికాకూడదని తమ దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమెరికా కేవలం ఐసిస్ స్థావరాలపైనే బాంబుల వర్షం కురిపించింది. ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు జరపడం రెండోసారి. గత నెలలో జరిపిన దాడుల్లో దాదాపు నలభై మంది వరకూ ఐసిస్ ఉగ్రవాదులు మరణించారని అమెరికా అధికారిక ప్రకటన చేసింది.
మృతులందరూ...
మృతులందరూ ఆల్ ఖైదా, ఐసిస్ గ్రూప్‌నకు చెందిన వారేనని తెలిపింది. ఐసిస్ ను బలహీన పర్చేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపింది. తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరికలు జారీ చేయడంలో భాగంగానే ఈ దాడులకు పాల్పడిందని సెంట్రల్ కమిటీ పేర్కొంది. తమ మిత్ర దేశాలు, భాగస్వామ్యుల జోలికి వస్తే ఊరుకోబోమని వార్నింగ్ గట్టిగానే ఇచ్చింది. మొత్తం మీద ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్యఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరొక వైపు అమెరికా సిరియాపై దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News