America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజ

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు

Update: 2024-11-06 01:34 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తొమ్మిది రాష్ట్రాల్లో గెలుపొందారు. 95 ఎలక్ట్రోరల్ ఓట్లను డొనాల్డ్ ట్రంప్ తెచ్చుకున్నారు. అయితే తన సమీప ప్రత్యర్థి డెమొక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కేువలం 35 ఎలక్ట్రోరల్ ఓట్లను మాత్రమే గెలుచుకున్నారు.

గెలవాలంటే?
ఐదు రాష్ట్రాల్లోనే ఆమె గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకూ అందిన అమెరికా ఫలితాల ప్రకారం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 270 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంది. ఓటింగ్ తీరు, ఓటర్ల మనోభావాలను చూస్తుంటే ట్రంప్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. మరి చివరి వరకూ ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.


Tags:    

Similar News