Earth Quake : క్యూబాలో భూకంపం.. ఆస్తి నష్టం?
క్యూబాలో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.8 తీవ్రతగా నమోదయింది
క్యూబాలో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.8 తీవ్రతగా నమోదయింది. జియోలాజికల్ సర్వే ప్రకారం తూర్పు క్యూబాలో ఈ భూకంపం ఆదివారం వచ్చింది. క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబాలోని భవనాలు భూకంపం ధాటికి కొంత బీటలు వారినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
రిక్టర్ స్కేల్ పై...
కొంత మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు. భూకంపం వల్ల అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. 14 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టంకొంత మేరకు జరిగిందని వారు వెల్లడించారు.