ఆప్ఘనిస్థాన్ లో భూకంపం... మృతుల సంఖ్య 1,150
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు.
ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. ఆప్ఘనిస్థాన్ లో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఆప్ఘనిస్థాన్ లోని పక్తికా, ఖోస్త్ ప్రావిణ్స్ లో భారీగా ప్రాణ నష్టంతో పాటు అపార ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ తరహాలో భూకంపం ఆప్ఘనిస్థాన్ లో సంభవించిందని చెబుతున్నారు. ఒక్క గయాన్ జిల్లాలో వెయ్యి ఇళ్ల వరకూ ధ్వంసమయ్యాయి.
సహాయ కార్యక్రమాలు...
శుక్రవారం కూడా భూకంపం సంభవించడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరో వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇంకా భూకంపం భయం నుంచి ప్రజలు తేరుకోలేదు. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను చేపట్టింది. నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.