ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు.. మరో రెండు సిల్వర్‌ పతకాలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం రెండు స్వర్ణాలు సహా అయిదు పతకాలు సొంతం చేసుకున్నారు..

Update: 2023-09-30 05:59 GMT

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం రెండు స్వర్ణాలు సహా అయిదు పతకాలు సొంతం చేసుకున్నారు. యువ షూటర్‌ పాలక్‌ గులియా ఒక స్వర్ణం, ఓ రజతం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన ఆమె.. అదే పోటీ టీమ్‌ విభాగంలోనూ రజతం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో పాలక్‌ (242.1 పాయింట్లు) అగ్రస్థానం సాధించగా.. హైదరాబాదీ యువ షూటర్‌ ఇషా సింగ్‌ (239.7) రెండో స్థానంతో రజతం కైవసం చేసుకుంది. అయితే పాలక్‌, ఇషాలిద్దరి కూడా 17 ఏళ్ల వయసులోనే ఇంతటి విజయం సాధించడం విశేషం. వీళ్లిద్దరూ దివ్యతో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రజతం సాధించారు. ముగ్గురిలో అత్యధికంగా ఇషా 579 పాయింట్లు సాధించగా.. పాలక్‌ 577, దివ్య 575 పాయింట్లు నమోదు చేశారు. మొత్తంగా 1731 పాయింట్లతో భారత్‌ రెండో స్థానం సాధించింది. చైనా (1736) పసిడి నెగ్గగా.. చైనీస్‌ తైపీ (1723) కాంస్యం దక్కించుకుంది. ఇషా ఇప్పటికే 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 27 పతకాలను గెలుచుకుంది. వీటిలో ఏడు బంగారు పతకాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది.


Tags:    

Similar News