సిత్రాంగ్ తో చితికిపోయిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ సిత్రాంగ్ తుపానుతో వణికిపోతుంది. భారీ వర్షాలతో దేశంలోని అనేక చోట్ల వరదలు సంభవించాయి.
బంగ్లాదేశ్ సిత్రాంగ్ తుపానుతో వణికిపోతుంది. భారీ వర్షాలతో దేశంలోని అనేక చోట్ల వరదలు సంభవించాయి. దాదాపు 35 మంది తుపాను కారణంగా మరణించారని తెలిిసింది. దాదాపు పది లక్షమంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో వరద నీటిలో చిక్కుకోవడంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
భారీ వర్షాలతో...
వరసగా రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురియడంతో అనేక ఇళ్లు నేలమట్ట మయ్యాయి. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. రహదారులకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రానికి విద్యుత్తు సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. వేల సంఖ్యలో విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో అధికారులు యుద్ధప్రాతిపదికమీద పనిచేస్తున్నారు.