America : నేడు ట్రంప్ ప్రమాణం

అమెరికా అధ్యక్షుడిగా నేడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.;

Update: 2025-01-20 02:19 GMT
donald trump,  sworn, president, america
  • whatsapp icon

అమెరికా అధ్యక్షుడిగా నేడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయిన తెలిసిందే. కొంతకాలం జరిగిన అమెరికన్ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఘన విజయం సాధించడంతో డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇండోర్ లోనే...
డొనాల్డ్ ట్రంప్ తొలుత బహిరంగ ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.. అయితే వాతావరణ ప్రభావం సహకరించలేదు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో వాతావరణ ప్రభావం ట్రంప్ ప్రమాణ స్వీకారంపై పడింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఇండోర్ లోనే ప్రమాణం చేయనున్నారు. వాషింగ్టన్ లో మైనస్ 11 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News