
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా చేరుకున్న ఆయనకు అక్కడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పర్చుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
కీలక అంశాలు...
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ఇరుదేశాలకు సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. భారత్ నుంచి అనేక మందిని వెనక్కు పంపుతున్న నేపథ్యంలో మోదీ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్ గత నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాను సందర్శించిన అతి కొద్ది మంది నేతల్లో ప్రధాని మోదీ ఒకరు.