భారీ భూకంపం .. 255 మంది మృతి

ఆప్ఘనిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో రెండు వందలకు పైగా ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Update: 2022-06-22 06:11 GMT

ఆప్ఘనిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో రెండు వందలకు పైగా ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది. తూర్పు పక్టికా ప్రావిన్స్ సమీపంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1 గా నమోదయిందని అధికారులు వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సహాయక చర్యలు ప్రారంభించారు. అక్కడి మీడియా కథనం ప్రకారం 255 మంది మరణించినట్లు తెలుస్తోంది.

శిధిలాల కింద చిక్కుకుని...
ఆప్ఫానిస్థాన్ లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకం కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కిందే చిక్కుకుని అనేక మంది మరణించారు. శిధిలాల చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేసింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.


Tags:    

Similar News