నేపాల్ లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 6.0 తీవ్రతగా నమోదయిందని భూకంప కేంద్ర తెలిపింది
నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై 6.0 తీవ్రతగా నమోదయిందని భూకంప కేంద్ర తెలిపింది. ఈరోజు ఉదయం ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్ రాజధాని అయిన ఖాట్ండ్ కు 147 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోటంగ్ జిల్లా లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అయితే భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆస్తినష్టం....
నేపాల్ లో భూకంపాలు సాధారణమయినప్పటికీ ఇప్పుడు వచ్చిన తీవ్రతతో కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఖాట్మండు లోయ, తూర్పు, మధ్య నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.